Sunday, 14 October 2007

ఈ ఎడారి దారి లోన ...

ఈ ఎడారి దారి లోన విరిసి రాలి పోదునా
ఇటులె రాలి పోదునా
కాన లోన కోన లోన.. కరకు రాతి సీమ లోన
ఎవరి కొరకు విరిసి నేను ఎదురు చూతునో .. ఇటులె ఎదురుచూతునో

మరల మరల మరలి రాని
మరువ లేని మరపు రాని
మధుర వసంత శోభ ఇటులె
మలగి పోవునా .. ఇటులె మలగి పోవునా

అందరాని చందమామ
పొందుకోరు ఈ చకోరి
మనసు మల్లె మాల చేసి
మ్రాను కేయునా .. ఇటులె మ్రాను కేయునా

No comments: