Sunday, 14 October 2007

రావే కోయిలా...

రావే కోయిలా... వెన్నెలా రేయిలా
మకర కేతను శరముల... నందన మందాకినిలా

ఎలమావి చివురులూ ఎదురు చూసె
రస హృదయాలు రాధకై వేచె
పూచే పూవులు వీచే గాలులు
పారే యేరు పరితపించె

ప్రేమ వని లో సుధలొలికింప
కలత చెందిన మది రంజింప
కలిసే మనసులు విరిసే సొగసులు
కురిసే వలపులు చివురించగా

No comments: