జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళ తోనే నాకున్న తావు నీ గుండె లోనే
కాదన్న నాడు నేనే లేను
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువ లో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువ లో
ఈ వెల్లువ లో ఏమవుతానో ఈ వేగం లో ఎటుపోతానో
ఈ నావ కు నీ చేరువ తావున్నదో తెర చాప నువ్వై నడిపించుతావో
దరి చేర్చి నన్ను ఒడి చేర్చు తావో
నట్టేట ముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చిత్రం : మంచి మనసులు
గాయని : ఎస్. జానకి
సంగీతం : ఇళయరాజ
వినండి చూడండి ఇక్కడ
Sunday, 20 April 2008
Thursday, 17 April 2008
నీయెదుట నేను ... వారెదుట నీవు ... మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
చందమామా అందాల మామా
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటవు?
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచింది
కన్నుల దాక కన్నులు పోక
మగసిరి యెడదను చూశాను
తల దాచుకొనుటకది చాలన్నాను
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
పెళ్ళి చూపులను బిగుసు కొని
పేరేమి? చదువేమి? నను ప్రేమిస్తావా? వయసెంత?
అని అడిగేర? అసలొచ్చార?
నాలొ వారు ఏం చూశారో నా వరయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంట
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెల లోని వేడి గాడ్పులు
నవ్వుల లోని నిప్పు రవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
చందమామా అందాల మామా
చిత్రం : తేనె మనసులు
పాత్ర ధారులు: కృష్ణ, సుకన్య
సంగీతం: కె వి మహదేవన్
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బా రావు
పాట ఇక్కడ వినండి
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటవు?
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచింది
కన్నుల దాక కన్నులు పోక
మగసిరి యెడదను చూశాను
తల దాచుకొనుటకది చాలన్నాను
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
పెళ్ళి చూపులను బిగుసు కొని
పేరేమి? చదువేమి? నను ప్రేమిస్తావా? వయసెంత?
అని అడిగేర? అసలొచ్చార?
నాలొ వారు ఏం చూశారో నా వరయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంట
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెల లోని వేడి గాడ్పులు
నవ్వుల లోని నిప్పు రవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను
నీయెదుట నేను
వారెదుట నీవు
మా యెదుట ఓ మామా ఎప్పుడుంటావు?
చందమామా అందాల మామా
చిత్రం : తేనె మనసులు
పాత్ర ధారులు: కృష్ణ, సుకన్య
సంగీతం: కె వి మహదేవన్
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బా రావు
పాట ఇక్కడ వినండి
Subscribe to:
Posts (Atom)