Sunday, 14 October 2007

నీ పాట లోని రాగము...

నీ పాట లోని రాగము
నా మది లోని అనురాగము
ఈ వెన్నెల రేయిలో ఈ చల్లని గాలిలో ...

నీవు పులకరించి పాడగా
కొమ్మమీది కోయిలమ్మ కూ కూ అనెను
నీ రూపమే నాలో మెదలగా
నా మనసే పురివిప్పి ఆడెను లే ...

ఉదయ భానుని లేత కిరణాల కే
నవ కమలం వికసించి విప్పారదా
నా చెలుడు నా హృదయ వీణను మీటగనే
నా మనసే పారేను సెలయేరుగా ...

No comments: