కృష్ణం కలయ సఖి సుందరం బాల(కృష్ణం)
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల (కృష్ణం)
నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల (కృష్ణం)
ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల (కృష్ణం)
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల(కృష్ణం)
రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల (కృష్ణం)
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల (కృష్ణం)
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల (కృష్ణం)
అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల (కృష్ణం)
రచన: నారాయణ తీర్ధ
Monday, 22 October 2007
Sunday, 14 October 2007
నిన్ను గాన లేను ..
నిన్ను గాన లేను .. నిన్ను చేరలేను
నీదు ప్రణయ రాధను నిలువలేని బేలను
నీదు ప్రేమ దాసినై నిన్ను కొలుతునోయి
ఓ అమర కావ్యమై నిన్ను తలుతునోయి
నీరాగ వేణువునై పరిమళింతునోయి
నీ పాద రేణువునై పులకరింతునోయి
శరత్కాల జ్యొత్స్నవై నన్ను తాకవోయి
మలయ పవన వీచికవై నన్ను సోకవోయి
నీలి మేఘ మాలికతో కబురు పంపవోయి
నీ గాన మధురిమ తో పలుకరించ వోయి
నీదు ప్రణయ రాధను నిలువలేని బేలను
నీదు ప్రేమ దాసినై నిన్ను కొలుతునోయి
ఓ అమర కావ్యమై నిన్ను తలుతునోయి
నీరాగ వేణువునై పరిమళింతునోయి
నీ పాద రేణువునై పులకరింతునోయి
శరత్కాల జ్యొత్స్నవై నన్ను తాకవోయి
మలయ పవన వీచికవై నన్ను సోకవోయి
నీలి మేఘ మాలికతో కబురు పంపవోయి
నీ గాన మధురిమ తో పలుకరించ వోయి
రావే కోయిలా...
రావే కోయిలా... వెన్నెలా రేయిలా
మకర కేతను శరముల... నందన మందాకినిలా
ఎలమావి చివురులూ ఎదురు చూసె
రస హృదయాలు రాధకై వేచె
పూచే పూవులు వీచే గాలులు
పారే యేరు పరితపించె
ప్రేమ వని లో సుధలొలికింప
కలత చెందిన మది రంజింప
కలిసే మనసులు విరిసే సొగసులు
కురిసే వలపులు చివురించగా
మకర కేతను శరముల... నందన మందాకినిలా
ఎలమావి చివురులూ ఎదురు చూసె
రస హృదయాలు రాధకై వేచె
పూచే పూవులు వీచే గాలులు
పారే యేరు పరితపించె
ప్రేమ వని లో సుధలొలికింప
కలత చెందిన మది రంజింప
కలిసే మనసులు విరిసే సొగసులు
కురిసే వలపులు చివురించగా
నీ జాడ కననైతి రా ...
నీ జాడ కననైతి రా
రేరేడు శయనించెరా నా సామి
పూలమోవులలోని మోవితావుల లోని
గాలి ఈలలు వేసె రా.. నా సామి
చాలా వేడిగ వీచెరా
వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా .. నా సామి
మనసెంతో వేగెరా
రచన సి. నారాయణ రెడ్డి
రేరేడు శయనించెరా నా సామి
పూలమోవులలోని మోవితావుల లోని
గాలి ఈలలు వేసె రా.. నా సామి
చాలా వేడిగ వీచెరా
వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా .. నా సామి
మనసెంతో వేగెరా
రచన సి. నారాయణ రెడ్డి
ఈ ఎడారి దారి లోన ...
ఈ ఎడారి దారి లోన విరిసి రాలి పోదునా
ఇటులె రాలి పోదునా
కాన లోన కోన లోన.. కరకు రాతి సీమ లోన
ఎవరి కొరకు విరిసి నేను ఎదురు చూతునో .. ఇటులె ఎదురుచూతునో
మరల మరల మరలి రాని
మరువ లేని మరపు రాని
మధుర వసంత శోభ ఇటులె
మలగి పోవునా .. ఇటులె మలగి పోవునా
అందరాని చందమామ
పొందుకోరు ఈ చకోరి
మనసు మల్లె మాల చేసి
మ్రాను కేయునా .. ఇటులె మ్రాను కేయునా
ఇటులె రాలి పోదునా
కాన లోన కోన లోన.. కరకు రాతి సీమ లోన
ఎవరి కొరకు విరిసి నేను ఎదురు చూతునో .. ఇటులె ఎదురుచూతునో
మరల మరల మరలి రాని
మరువ లేని మరపు రాని
మధుర వసంత శోభ ఇటులె
మలగి పోవునా .. ఇటులె మలగి పోవునా
అందరాని చందమామ
పొందుకోరు ఈ చకోరి
మనసు మల్లె మాల చేసి
మ్రాను కేయునా .. ఇటులె మ్రాను కేయునా
పాడనా మధురమైన పాట ...
పాడనా మధురమైన పాట పాడనా
ఎడద లోని భావ లహరి పొంగి పొరలగా
చెంగలించు లేగ దూడ కనులలోని కాంతి తో
మోరసాచి నెమరు వేయు గోవు కనుల సాంతి తో
చిన్ని పాప పలుకు లోని జిలిబిలి స్వరాలతో
కలిసి మెలిసి కావ్య మైన మధుర భావ సరళి లో
సంధ్య వేళ మరలి వచ్చు ఆల మెడల మువ్వలతో
గలగల రాగాలు పారు సెలయేరుల సవ్వడి తో
కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో
కలిసి మెలిసి కావ్య మైన సహాజ భావ సరళి లో
ఎడద లోని భావ లహరి పొంగి పొరలగా
చెంగలించు లేగ దూడ కనులలోని కాంతి తో
మోరసాచి నెమరు వేయు గోవు కనుల సాంతి తో
చిన్ని పాప పలుకు లోని జిలిబిలి స్వరాలతో
కలిసి మెలిసి కావ్య మైన మధుర భావ సరళి లో
సంధ్య వేళ మరలి వచ్చు ఆల మెడల మువ్వలతో
గలగల రాగాలు పారు సెలయేరుల సవ్వడి తో
కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో
కలిసి మెలిసి కావ్య మైన సహాజ భావ సరళి లో
నీ పాట లోని రాగము...
నీ పాట లోని రాగము
నా మది లోని అనురాగము
ఈ వెన్నెల రేయిలో ఈ చల్లని గాలిలో ...
నీవు పులకరించి పాడగా
కొమ్మమీది కోయిలమ్మ కూ కూ అనెను
నీ రూపమే నాలో మెదలగా
నా మనసే పురివిప్పి ఆడెను లే ...
ఉదయ భానుని లేత కిరణాల కే
నవ కమలం వికసించి విప్పారదా
నా చెలుడు నా హృదయ వీణను మీటగనే
నా మనసే పారేను సెలయేరుగా ...
నా మది లోని అనురాగము
ఈ వెన్నెల రేయిలో ఈ చల్లని గాలిలో ...
నీవు పులకరించి పాడగా
కొమ్మమీది కోయిలమ్మ కూ కూ అనెను
నీ రూపమే నాలో మెదలగా
నా మనసే పురివిప్పి ఆడెను లే ...
ఉదయ భానుని లేత కిరణాల కే
నవ కమలం వికసించి విప్పారదా
నా చెలుడు నా హృదయ వీణను మీటగనే
నా మనసే పారేను సెలయేరుగా ...
Saturday, 13 October 2007
ప్రభాత మైనది రా ...
ప్రభాత మైనది రా ప్రభో మేలుకోర
బందీలైన తుమ్మెదలన్నీ
ఇందీవరమున పిలిచెనుర
కిరణాలతో కమల నయనాలు కలిసే
తరుణమాయెరా మేలుకో
పల్లవించిన ఉల్లాసముతో
భావ వల్లరి పులకించెనురా
తొలగి పోయిన మంచు ముసుగు లో
తొలిదిశ అందము చిందెను రా
ప్రతి కుసుమము లో పొంగిన మధువు
అమృతము కంటే తీయన రా
దోసిట నిండిన కుసుమాలు నీ
కోసమే వేచి ఉన్నవి రా
బందీలైన తుమ్మెదలన్నీ
ఇందీవరమున పిలిచెనుర
కిరణాలతో కమల నయనాలు కలిసే
తరుణమాయెరా మేలుకో
పల్లవించిన ఉల్లాసముతో
భావ వల్లరి పులకించెనురా
తొలగి పోయిన మంచు ముసుగు లో
తొలిదిశ అందము చిందెను రా
ప్రతి కుసుమము లో పొంగిన మధువు
అమృతము కంటే తీయన రా
దోసిట నిండిన కుసుమాలు నీ
కోసమే వేచి ఉన్నవి రా
వాణి శర్వాణి ...
వాణి శర్వాణి వీణా పాణి
పుస్తక ధారిణి అక్షధామ శుక వారిజ పాణి
వర దాయిని సుర లోక గాయినీ
శిలలు ద్రవించగ రసపూరితముగ
నిని క్వాణపు షద్జమ నాదం
నాదము లో కల బ్రహ్మ నాదమును
వినగల పుణ్యులే ధన్య జీవులే
భావము పూజ్యము భంగిమ లెరుగను
భావ లయన్విత రాగము లెరుగను
భావ రాగ లయ భంగిమ లిమ్మ
భామిని భారతి వందనమమ్మ
పుస్తక ధారిణి అక్షధామ శుక వారిజ పాణి
వర దాయిని సుర లోక గాయినీ
శిలలు ద్రవించగ రసపూరితముగ
నిని క్వాణపు షద్జమ నాదం
నాదము లో కల బ్రహ్మ నాదమును
వినగల పుణ్యులే ధన్య జీవులే
భావము పూజ్యము భంగిమ లెరుగను
భావ లయన్విత రాగము లెరుగను
భావ రాగ లయ భంగిమ లిమ్మ
భామిని భారతి వందనమమ్మ
కోయిల పాడింది ...
కోయిల పాడింది వసంత రాగం
అనురాగాల మోహన గీతం
రెమ్మ రెమ్మన విరిసిన నవ్వులు
అధర సుధలు చిలికించిన వేళా
మలయానిలమే హృదయ భావమై
చందన సందేశ గంధము వేచగ
మదిలో మెదిలే ప్రణయ సింధువు
నీరాక కోసం వేచిన క్షణము
దరహాస చంద్రిక శీతంశువు గా
పరచిన చూపుల నడచి రమ్మని
అనురాగాల మోహన గీతం
రెమ్మ రెమ్మన విరిసిన నవ్వులు
అధర సుధలు చిలికించిన వేళా
మలయానిలమే హృదయ భావమై
చందన సందేశ గంధము వేచగ
మదిలో మెదిలే ప్రణయ సింధువు
నీరాక కోసం వేచిన క్షణము
దరహాస చంద్రిక శీతంశువు గా
పరచిన చూపుల నడచి రమ్మని
అందాల ఆమని ...
అందాల ఆమని ఆనంద దాయినీ
అరుదెంచినావటే అప్సరా కామినీ
గండు కోయిల నీదు గళమందు పాడినది
నిండు పండువ నీదు గుండెలో దాగినదీ
పువ్వులే నవ్వులుగ పులకించి పోదువా
నవ్వులే వెన్నెలగ నన్ను మురిపింతువా
యుగయుగాలుగ కవుల ఊరించు రసధుని
మధురార్ధ హృదయినివె మాధవుని భామిని
అరుదెంచినావటే అప్సరా కామినీ
గండు కోయిల నీదు గళమందు పాడినది
నిండు పండువ నీదు గుండెలో దాగినదీ
పువ్వులే నవ్వులుగ పులకించి పోదువా
నవ్వులే వెన్నెలగ నన్ను మురిపింతువా
యుగయుగాలుగ కవుల ఊరించు రసధుని
మధురార్ధ హృదయినివె మాధవుని భామిని
మాధురీ..
మాధురీ రసానంద ఝరి...
వెన్నెలలో గొదావరి... కన్నులలో కన్యాకుమారి...
నయన మనోహరి నాట్య మయూరి
నవ్వుల పువ్వులు విసిరే గడసరి
నగవుల విధము నడయాడే సొగసరి
నాజీవన బృందావన సుందరి
కవుల కల్పనా శిల్పము నీవె
కాళిదాసు శకుంతలి నీవె
కిన్నెర సాని వన్నెలు నీవె
కన్నుల వెలిగే పున్నమి నీవే
వెన్నెలలో గొదావరి... కన్నులలో కన్యాకుమారి...
నయన మనోహరి నాట్య మయూరి
నవ్వుల పువ్వులు విసిరే గడసరి
నగవుల విధము నడయాడే సొగసరి
నాజీవన బృందావన సుందరి
కవుల కల్పనా శిల్పము నీవె
కాళిదాసు శకుంతలి నీవె
కిన్నెర సాని వన్నెలు నీవె
కన్నుల వెలిగే పున్నమి నీవే
Friday, 12 October 2007
నా ఱేడు కోసం ...
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
కలలోన కవ్వించి కనుమూసి నవ్వించి
కలత నిదుర లో నన్ను ఓ జాబిలి...
పలుకరించి పయనమాయె ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
మేఘాల మాటున మేను మరచి నిదరోతే
ఓదార్చెదెవ్వరు? ఓ జాబిలి ...
ఓపలేను తాపం ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
కలలోన కవ్వించి కనుమూసి నవ్వించి
కలత నిదుర లో నన్ను ఓ జాబిలి...
పలుకరించి పయనమాయె ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
మేఘాల మాటున మేను మరచి నిదరోతే
ఓదార్చెదెవ్వరు? ఓ జాబిలి ...
ఓపలేను తాపం ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
Subscribe to:
Posts (Atom)