ప్రభాత మైనది రా ప్రభో మేలుకోర
బందీలైన తుమ్మెదలన్నీ
ఇందీవరమున పిలిచెనుర
కిరణాలతో కమల నయనాలు కలిసే
తరుణమాయెరా మేలుకో
పల్లవించిన ఉల్లాసముతో
భావ వల్లరి పులకించెనురా
తొలగి పోయిన మంచు ముసుగు లో
తొలిదిశ అందము చిందెను రా
ప్రతి కుసుమము లో పొంగిన మధువు
అమృతము కంటే తీయన రా
దోసిట నిండిన కుసుమాలు నీ
కోసమే వేచి ఉన్నవి రా
Saturday, 13 October 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment