Sunday, 14 October 2007

నీ జాడ కననైతి రా ...

నీ జాడ కననైతి రా
రేరేడు శయనించెరా నా సామి

పూలమోవులలోని మోవితావుల లోని
గాలి ఈలలు వేసె రా.. నా సామి
చాలా వేడిగ వీచెరా

వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా .. నా సామి
మనసెంతో వేగెరా

రచన సి. నారాయణ రెడ్డి

No comments: