నిన్ను గాన లేను .. నిన్ను చేరలేను
నీదు ప్రణయ రాధను నిలువలేని బేలను
నీదు ప్రేమ దాసినై నిన్ను కొలుతునోయి
ఓ అమర కావ్యమై నిన్ను తలుతునోయి
నీరాగ వేణువునై పరిమళింతునోయి
నీ పాద రేణువునై పులకరింతునోయి
శరత్కాల జ్యొత్స్నవై నన్ను తాకవోయి
మలయ పవన వీచికవై నన్ను సోకవోయి
నీలి మేఘ మాలికతో కబురు పంపవోయి
నీ గాన మధురిమ తో పలుకరించ వోయి
Sunday, 14 October 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment