Sunday, 14 October 2007

పాడనా మధురమైన పాట ...

పాడనా మధురమైన పాట పాడనా
ఎడద లోని భావ లహరి పొంగి పొరలగా

చెంగలించు లేగ దూడ కనులలోని కాంతి తో
మోరసాచి నెమరు వేయు గోవు కనుల సాంతి తో
చిన్ని పాప పలుకు లోని జిలిబిలి స్వరాలతో
కలిసి మెలిసి కావ్య మైన మధుర భావ సరళి లో

సంధ్య వేళ మరలి వచ్చు ఆల మెడల మువ్వలతో
గలగల రాగాలు పారు సెలయేరుల సవ్వడి తో
కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో
కలిసి మెలిసి కావ్య మైన సహాజ భావ సరళి లో

No comments: