నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
కలలోన కవ్వించి కనుమూసి నవ్వించి
కలత నిదుర లో నన్ను ఓ జాబిలి...
పలుకరించి పయనమాయె ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
మేఘాల మాటున మేను మరచి నిదరోతే
ఓదార్చెదెవ్వరు? ఓ జాబిలి ...
ఓపలేను తాపం ఓ నెచ్చెలి
నా ఱేడు కోసం నడి రేయి దాక వేచాను ఓ జాబిలి...
ఆ తోడు కోసం రాదారులన్నీ చూశాను ఓ జాబిలి...
Friday, 12 October 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment