జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళ తోనే నాకున్న తావు నీ గుండె లోనే
కాదన్న నాడు నేనే లేను
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువ లో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువ లో
ఈ వెల్లువ లో ఏమవుతానో ఈ వేగం లో ఎటుపోతానో
ఈ నావ కు నీ చేరువ తావున్నదో తెర చాప నువ్వై నడిపించుతావో
దరి చేర్చి నన్ను ఒడి చేర్చు తావో
నట్టేట ముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామాయ్య యెదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చిత్రం : మంచి మనసులు
గాయని : ఎస్. జానకి
సంగీతం : ఇళయరాజ
వినండి చూడండి ఇక్కడ
Sunday, 20 April 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment